ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ తీవ్రత కొనసాగుతోంది. పలు దేశాలను ఓమిక్రాన్ వేరియంట్ వణికిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో ఓమిక్రాన్ వేరియంట్ తీవ్రత అధికంగా ఉంది. యూకేలో కేసుల సంఖ్య లక్షను దాటింది. ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య రెండు లక్షలకు దగ్గరకు వచ్చాయి. ఇదిలా ఉంటే మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఆస్ట్రేలియాలో తొలి ఓమిక్రాన్ మరణం నమోదైంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 30కి పైగా మరణాలు సంబవించాయి. ఇందులో ఒక్క యూకేలోనే 29 మరణాలు నమోదయ్యాయి.
తాజాగా ఓమిక్రాన్ వల్ల ఆస్ట్రేలియాలో తొలి మరణం నమోదు కావడంతో ఆదేశ ప్రభుత్వం ఉలిక్కిపడింది. తాజాగా ఆస్ట్రేలియాలో కరోనాతో 6 మంది మరణించారు. దీంతో ఓమిక్రాన్ బాధితుడు కూడా ఉన్నాడు. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో ఈ మరణం నమోదైంది. 80 ఏళ్ల వయసున్న వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఓమిక్రాన్ తో పాటు అంతర్గత సమస్యల కారణాలు కూడా తొడవ్వడంతో అతను మరణించినట్లు అధికారులు వెల్లడించారు.