ఇండియాలో 578 ఓమిక్రాన్ కేసులు… దేశంలో 6వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం

-

దేశంలో ఓమిక్రాన్ వేగంగా విస్తరింస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. రెండు మూడు రోజుల్లోనే కేసుల సంఖ్య పెరుగుతుండటం దీని తీవ్రతకు అద్దం పడుతోంది. దక్షిణాఫ్రికాలో మొదలైన  ఈ వేరియంట్ ప్రపంచంలోని వందకు పైగా దేశాలకు విస్తరించింది. ముఖ్యంగా యూకేలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు సంఖ్య 2 లక్షలకు చేరువైంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 30కి పైగా మరణాలు నమోదయ్యాయి.

తాజాగా ఇండియాలో 578 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 151 మంది ఓమిక్రాన్ బారి నుంచి బయటపడ్డారు. దేశంలో ఢిల్లీ, మహారాష్ట్రలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదైంది. ఈ రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రంలో 140కి పైగా ఓమిక్రాన్ కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. వీటి తరువాతి స్థానాల్లో కేరళ, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ ఓమిక్రాన్ కేసుల్లో దేశంలో ఆరోస్థానంలో ఉంది. తెలంగాణలో ఇప్పటి వరకు 41 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 10 మంది ఓమిక్రాన్ నుంచి కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news