SHOCKING NEWS: కరోనా సోకిన ఏడు నెలల పాటు శరీరంలోనే కరోనా వైరస్…

-

కరోనా ప్రపంచాన్ని భయపెడుతోంది. ప్రస్తుతం ఓమిక్రాన్ వేరియంట్ రూపంలో వచ్చి.. ప్రపంచ దేశాల్లో తన ప్రతాపం చూపిస్తోంది. అయితే తాజాగా కరోనా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. కరోనా ఒక్కసారి సోకితే.. దాదపు ఏడు నెలల దాాకా మానవ శరీరంలోనే ఉంటుందని తేలింది. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు ఓ అధ్యయనంలో బయటపడింది. శరీరంలోని వివిధ భాగాలపై ప్రభావం చూపిస్తుందని అధ్యయనం తేల్చింది. లక్షణాలు లేని వారిలో, స్వల్ప లక్షణాలు ఉన్నవారిలో కూడా ఇదే స్థాయిలో కరోనా వైరస్ ప్రభావం చూపిస్తుందని వెల్లడైంది.

మెదడుతో పాటు శరీరంలోని మిగతా అవయవాలపై కూడా ప్రభావం చూపిస్తుందని తేలింది. వైరస్ ఎక్కువగా శ్వాసనాళంలో ఉంటుందని… 97.7 శాతం వైరస్ ను ఇక్కడే గుర్తించారు.  గుండె రక్తనాళ కణజాలం, లింఫోయిడ్, జీర్ణశయాంతర కణజాలాలు, మూత్రపిండం, ఎండోక్రైన్ కణజాలంలో గుర్తించినట్లు తెలిపింది. పునరుత్పత్తి కణజాలం, కండరాలు, చర్మం, కొవ్వులోనూ వైరస్‌ ఉండటాన్ని కనుగొన్నట్లు వివరించింది. శరీరంలోని పలు అవయవాలతో పాటు.. మెదడులో ఏడు నెలలపాలు ఉంటూ దాడి చెస్తుందని తేలింది. కాగా ఉపిరితిత్తుల్లో ఎలాంటి వైరస్ గుర్తించలేదని సదరు అధ్యయనం తెలిపింది. కోవిడ్ సోకి చనిపోయిన 44 మందిపై అధ్యయనం చేయడంతో ఈవిషయం వెలుగులోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news