యూకేలో ఓమిక్రాన్ విలయ తాండవం…. 70 వేలకు పైగా కేసులు, పెరిగిన మరణాలు

-

ప్రపంచంలో ఓమిక్రాన్ విలయ తాండవం చేస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదలైన కరోనా వేరియంట్ ఓమిక్రాన్ తక్కువ కాలంలో ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ఇప్పటికే 90పైాగా దేశాలకు వ్యాపించింది. ఇదిలా ఉంటే యూరోపియన్ దేశాల్లో ఓమిక్రాన్ తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా యూకేలో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది.  దీంతో ఆసుపత్రులపై ఒత్తడి ఎదుర్కొంటుంది ఆదేశం. దేశంలో ఇప్పటి వరకు 74,089 మందికి ఓమిక్రాన్ సోకింది. ప్రపంచంలో ఎక్కువగా యూకేలోనే ఓమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి.

ఇదిలా ఉంటే మరణాల్లో కూడా యూకే మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో తొలి మరణం యూకేలోనే సంభవించింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ వల్ల 21 మంది మరణించారు. దీంట్లో 18 మంది యూకేలోనే మరణించారు. ఇప్పటి వరకు ఓమిక్రాన్ వల్ల స్వల్ప లక్షణాలే ఉన్నాయనే వారు… అయితే ప్రస్తుతం మాత్రం మరణాలు చోటు చేసుకోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఇండియాలో కూడా ఓమిక్రాన్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇండియాలో 300కు పైగా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news