ఒమిక్రాన్ ఎఫెక్ట్ : జనవరి 10 వరకు స్కూల్స్ బంద్‌

-

దక్షిణాప్రికా దేశంలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి.. ప్రపంచ దేశాలనను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి కే ఈ మహమ్మారి వైరస్‌ 90 దేశాలకు పైగా పాకేసింది. ఇటు మన దేశంలోనూ.. ఈ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో.. దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికే.. కరోనా ఆంక్షలను విధిస్తున్నాయి.

ఇక తాజాగా తమిళనాడు రా ష్ట్ర సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా జనవరి 10 వ తేదీ వరకు 1 నుంచి 8 తరగతుల విద్యార్థులలకు శారీరక తరగతులు జరగవని పేర్కొంది. కరోనా కు సంబంధించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నోటీసును విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం.. జనవరి 10 వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని.. 1 వ తరగతి నుంచి 8 వ తరగతుల విద్యార్థులకు శారీరక తరగతు లు ఉండవు అన్న మాట. ఇక యూకజ, ఎల్‌ కేజీ తరగతులకు అనుమతి లేదు.

Read more RELATED
Recommended to you

Latest news