ఒమిక్రాన్ ప్రస్తుతం ఈ ఒక్క పేరు ప్రపంచాన్ని వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదలైన కరోనా కొత్త వేరియంట్ వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాపించింది. సగం కన్నా ఎక్కువ దేశాల్లో ఓమిక్రాన్ విస్తరించింది. ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో కల్లోకం కలిగిస్తోంది. యూకేలో కేసుల సంఖ్య లక్షకు చేరువ అవుతోంది.
ఇదిలా ఉంటే ఇండియాలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దేశంలో 415 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గత రెండు మూడు రోజుల్లోనే కేసుల సంఖ్య డబుల్ అయింది. 17 రాష్ట్రాల్లో ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఉన్న గణాంకాల ప్రకారం ఓమిక్రాన్ నుంచి 115 మంది కోలుకున్నారు.
ముఖ్యంగా మహారాష్ట్రను ఓమిక్రాన్ కేసులు కలరవపెడుతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య సెంచరీని దాటింది. మహారాష్ట్రతో పాటు ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలు తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఓమిక్రాన్ భయాలతో పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షల చట్రంలోకి వెళ్లాయి. ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాల నైట్ కర్ప్యూ విధించాయి. ఓడిశా, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలు న్యూ ఇయర్, క్రిస్మస్ వేడుకలను నిషేధించాయి.
COVID19 | A total of 415 #Omicron cases were reported in 17 States/UTs of India so far. The number of persons recovered is 115: Union Health Ministry pic.twitter.com/DXuW4LBTeT
— ANI (@ANI) December 25, 2021