ఓమిక్రాన్ ఎఫెక్ట్… ఆ రాష్ట్రంలో 144 సెక్షన్ విధింపు… న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం

-

ఓమిక్రాన్ ఎఫెక్ట్ తో ఒక్కొక్క రాష్ట్రం ఆంక్షల్లోకి వెళుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా, కేరళ, గుజరాత్, ఢిల్లీ, గోవా మొదలైన రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూని విధించాయి. మరికొన్ని రాష్ట్రాలు న్యూ ఇయర్ వేడుకులపై నిషేధాన్ని విధించాయి. తాజాగా మహారాష్ట్ర లో కరోనా.. ముఖ్యంగా ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న కారణంగా ఆరాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రాజధాని ముంబై నగరంలో 144 సెక్షన్ విధించింది. ముంబైలో నేటి నుండి జనవరి 7, 2022 వరకు సెక్షన్ 144 విధించారు. డిసెంబర్ 30 నుండి జనవరి 7 వరకు రెస్టారెంట్లు, హోటళ్లు, బార్‌లు, పబ్‌లు, రిసార్ట్‌లు, క్లబ్‌లతో సహా మూసివేయాలని.. బహిరంగ ప్రదేశంలో నూతన సంవత్సర వేడుకలు, పార్టీలను పోలీసులు నిషేధించారు.

ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో మహారాష్ట్రలో కరోనా, ఓమిక్రాన్ కేసులు అలజడి కలిగిస్తున్నాయి. 24 గంటల్లోనే ఆ రాష్ట్రంలో కొత్తగా 85 ఓమిక్రాన్ కేసులు నమోదవ్వగా.. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 252కు చేరింది. వీటిలో ఒక్క ముంబై లోనే 137 కేసులు ఉన్నాయి.  మరో వైపు గత 24 గంటల్లో కొత్తగా 3900 కేసులు నమోదవ్వగా.. 20 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news