న్యూ ఇయర్ వేడుకలు ఉంటాయా… ఉండవా… నేడు హైకోర్ట్ తీర్పుపై అందరిలో ఉత్కంఠ

-

తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకులు ఉంటాయా..? ఉండవా..? అనే చర్చ జరుగుతోంది ఇప్పడు. నేడు రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్ట్ కీలక తీర్పు వెల్లడించనుంది. కాగా ఈ తీర్పుపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై నిన్న హైకోర్ట్ లో పిటీషన్ దాఖలైంది. హైకోర్ట్ ఆదేశాలను పట్టించుకోకుండా వేడుకలకు ప్రభుత్వం అనుమతించిందని ఓ పిటిషన్ దారుడు కోర్ట్ లోవ పిటిషన్ దాఖలు చేశారు. పాండమిక్, ఎపిడమిక్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ లను ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని ఆరోపణ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసి ఆంక్షలు పెట్టాలని హైకోర్ట్ ను కోరాడు పిటిషనర్.

తాజాగా ఈ పిటిషన్ పై హై కోర్ట్ విచారణ జరుపనుంది.  ఈ అంశంపై కోర్ట్ ప్రభుత్వనికి ఎటువంటి డైరెక్షన్ ఇస్తుందో చూడాలి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలకు కొన్ని ప్రత్యేక ఈవెంట్లకు అనుమతి ఇవ్వడంతో పాటు..బార్లు, వైన్స్ అర్థరాత్రి కొనసాగేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఓ వైపు ఓమిక్రాన్ పెరుగుతున్న క్రమంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news