ఓమిక్రాన్ పై కేంద్రం కీలక నిర్ణయం… ఆ పది రాష్ట్రాలకు కేంద్ర ಬೃಂదాలు

-

దేశంలో ఓమిక్రాన్ విస్తరిస్తోంది. ఇప్పటిికే 17 రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. కేసుల మొత్తం సంఖ్య 400ను దాటింది. మరో వారం రోజుల్లో కేసులు సంఖ్య వెయ్యికి చేరుతుందని.. నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో కేంద్రం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే కేంద్రం అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఓమిక్రాన్ తీవ్రత పెరగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యహరించాలని ఆదేశించింది.corona-virus

ఓమిక్రాన్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాధి తీవ్రత, వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. ముఖ్యంగా పది రాష్ట్రాలకు కేంద్ర ಬೃಂదాలను పంపనుంది. కేరళ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, మిజోరాం, కర్ణాటక, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు సెంట్రల్ టీమ్స్ వెల్లనున్నాయి. ఈ రాష్ట్రాల్లో 3 నుంచి 5 రోజుల పాటు కేంద్ర ಬೃಂదాలు అక్కడే ఉండనున్నాయి. ఓమిక్రాన్ తీవ్రతను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూనే.. వ్యాక్సిన్ వేగవంతం చేసేలా చర్యలు తీసుకోనున్నాయి. కోవిడ్ పరీక్షలు, కరోనా నిబంధనల అమలుపై రాష్ట్రాలతో కేంద్ర ಬೃಂదాలు పనిచేయనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news