BREAKING : భారత్‌లో 2,135కి చేరిన ఒమిక్రాన్‌ కేసులు

-

దక్షిణాఫ్రికాలో పురుడు పోసుకున్న ఓమిక్రాన్ వేరియంట్… ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త వైరస్ ఇప్పటికే… ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చెందింది. ఏకంగా 99 దేశాలకు ఈ కొత్త వైరస్ వ్యాప్తి చెందినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇటు ఇండియాలోనూ ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.ఇప్పటి వరకు భారత్‌ లో ఒమిక్రాన్‌ కేసులు సంఖ్య 2,135కి చేరింది. అలాగే 828 మంది ఓమిక్రాన్ వైరస్ నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలో 653, ఢిల్లీలో 464, కేరళలో 185, రాజస్థాన్ లో 174, గుజరాత్ లో 154, తమిళనాడు లో 121, తెలంగాణ లో 84, కర్ణాటకలో 77, హర్యానాలో 71, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 కేసులు నమోదయ్యాయి. మొత్తం ఇండియా వ్యాప్తంగా 24 రాష్ట్రాలకు ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి చెందింది.  కాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 58,097 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,14,004 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news