బీహార్ డిప్యూటీ సీఎంతో పాటు మ‌రో మంత్రికి క‌రోనా

-

దేశంలో క‌రోనా వైర‌స్ ఎలాంటి తేడాలు లేకుండా అంద‌రికీ సోకుతుంది. ఈ మ‌ధ్య కాలంలో ప‌లు రాష్ట్రాల‌లో మంత్రుల‌కు కూడా క‌రోనా వైర‌స్ సోకుతుంది. తాజా గా బీహార్ రాష్ట్రంలో ఇద్ద‌రు మంత్రులు క‌రోనా బారిన ప‌డ్డారు. బీహార్ రాష్ట్ర డీప్యూటీ ముఖ్య‌మంత్రి రేణు దేవీతో పాటు బీహార్ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి సునీల్ కుమార్ కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. తాజా గా వారు ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లు చేసుకోగా.. అందులో క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. దీంతో త‌మ‌ను ఇటీవ‌ల క‌లిసిన వారంతా కూడా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు చేసుకోవాల‌ని, అలాగే క్వారైంటెన్ లో ఉండాల‌ని కోరారు.

కాగ క‌రోనా వైర‌స్ వ్యాప్తి గ‌త కొద్ది రోజుల నుంచి విప‌రీతంగా పెరుగుతుంది. నిన్న దేశ వ్యాప్తంగా 37 వేల క‌రోనా కేసులు న‌మోదు అయితే ఈ రోజు ఏకంగా 58,097 కేసులు న‌మోదు అయ్యాయి. ఈ సంఖ్య రేపు ఇంకా పెరిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అభిప్రాయ ప‌డుతున్నారు. రాష్ట్రాల మంత్రులకు కూడా కరోనా సోకుతున్న నేప‌థ్యంలో సామాన్యులు జగ్ర‌త్తగా ఉండాల‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news