బ్రిటన్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన మహిళకు ఓమిక్రాన్ నెగిటివ్..

-

కరోనా వేరియంట్ ఓమిక్రాన్న ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇండియాలో కూడా ఇప్పటి వరకు 21 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. అయితే తెలంగాణలో కూడా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యే అవకాశం లేకపోలేదని వైద్యారోగ్య శాక అంటుంది. అయితే ఇప్పటి వరకు మాత్రం తెలంగాణలో ఒక్క ఓమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదు.

ఇటీవల బ్రిటన్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన మహిళకు ఓమిక్రాన్ లక్షణాలు ఉండటంతో కలవరం మొదలైంది. ఒక్కసారిగా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.ఆమె నమూనాలను జీనోమ్ సిక్వెన్సింగ్ కోసం ల్యాబుకు పంపారు. తాజాగా ఆ మహిళకు ఓమిక్రాన్ వేరియంట్ సోకలేదని తేలింది. తాజాగా వచ్చిన ఫలితాల్లో బ్రిటన్  నుంచి వచ్చిన మహిళకు ఓమిక్రాన్ నెగిటివ్ గా తేలింది.

ఇదిలా ఉండగా విదేశాల నుంచి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన 12 మందికి కొవిడ్‌ నిర్ధరణ అయింది. వారి జీనోమ్ సీక్వెన్స్ రిపోర్టు రావాల్సి ఉంది. వీరంతా యూకే, కెనడా, అమెరికా, సింగపూర్‌ నుంచి హైదరాబాద్​కు వచ్చారు. యూకే నుంచి వచ్చిన 9 మందికి… అమెరికా, కెనడా, సింగపూర్‌ నుంచి వచ్చిన ముగ్గురికి వైరస్ సోకినట్లుగా పరీక్షల్లో వెల్లడైంది. వీరి ఫలితాలు వస్తే ఎంత ఓమిక్రాన్ సోకిందా.. లేదా అని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news