MS DHONI : CSKను వదిలేసి.. సౌతాఫ్రికా లీగ్ లోకి ధోని?

-

మహేంద్ర సింగ్ ధోని ప్రత్యేకంగా పరిచయం అక్కర లేని పేరు. బహుశా ఇండియన్ క్రికెట్ హిస్టరీలో సచిన్ టెండూల్కర్ తరువాత అంతటి పేరు సంపాదించిన వ్యక్తి ఎంఎస్ ధోనీనే. ఇండియన్ క్రికెట్ లో విజయవంతమైన కెప్టెన్ గా, ఆటగాడిగా మిస్టర్ కూల్ పేరు సంపాదించుకున్నారు. అయితే, ధోని రిటైర్మెంట్ ప్రకటించి సంవత్సరాలు గడుస్తున్నా గాని ధోని పై ఫ్యాన్స్ కు అభిమానం మాత్రం తగ్గడం లేదు.

MS-Dhoni-Chennai-Super-Kings-CSK-IPL-2020
MS-Dhoni-Chennai-Super-Kings-CSK-IPL-2020

ఇక మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే ఐపిఎల్ కు సన్నద్ధం అవుతున్నాడు తలైవా. అందుకు సంబంధించి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసాడు ధోని. ఈ క్రమంలోనే ధోని గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా టీ 20 లీగ్ కమిషనర్ గ్రేమ్ స్మిత్ ధోని లాంటి ఆటగాడు టి20 లీగుల్లో ఆడాలని ప్రతి ఫ్రాంచైజీ కోరుకుంటుంది. అలాంటి ప్లేయర్ లీగ్ కె పేరు తీసుకొస్తాడు అని గ్రీన్ స్మిత్ అన్నాడు. ఇక అవకాశాలు ఉంటే ధోని తప్పనిసరిగా సౌత్ ఆఫ్రికా టీ 20 లీగ్ కు తీసుకొస్తానని స్మిత్ పేర్కొన్నాడు. ధోని లాంటి దిగ్గజాలతో కలిస్తే మా విలువ మరింత పెరుగుతుంది. ధోనిలో ఉండే నాయకత్వ లక్షణాలు మా యంగ్ ప్లేయర్ల టి20 లీగ్ ను ఓ మెట్టు పైకి ఎక్కిస్తుందని మేం భావిస్తున్నాం అని స్మిత్ పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news