మరోసారి సత్తా చాటి కేటీఆర్.. ఆ సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక

-

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ రాజకీయాల్లోనే కాకుండా ఆటలంటే కూడా ఇష్టం. ఈ నేపథ్యంలో నేడు నిర్వహించిన తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘానికి మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘానికి అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే… తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘానికి తాజాగా నిర్వహించిన ఎన్నికల్లోనూ ఆయన ఏకగ్రీవం అయ్యారు.

Telangana: KTR a tweet away for citizens in times of Covid-19 | Hyderabad  News - Times of India

వరుసగా రెండోసారి బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్‌ ఎన్నికవడం విశేషం. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కు నేడు హైదరాబాద్ ఫిలింనగర్ లోని ఎఫ్ఎన్ సీసీ క్లబ్ లో ఎన్నికలు నిర్వహించారు. బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శిగా పుల్లెల గోపీచంద్ ఎన్నికయ్యారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా యుగంధర్ రావు, వైస్ ప్రెసిడెంట్ గా చాముండేశ్వరినాథ్, కోశాధికారిగా పాణీరావు ఎన్నికయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news