జూనియర్ ఎన్టీఆర్ పై మరోసారి సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురు పూజోత్సవం కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన చేసిన సోమువీర్రాజు…జూనియర్ ఎన్టీఆర్ చక్కటి నటుడని మెచ్చుకున్నారు. భరత నాట్యాన్ని అభ్యసించాడు… బాల రామాయణంతో జూనియర్ ఎన్టీఆర్ తొలి సినిమా అని తెలిపారు. భరత నాట్యంలో ముద్ర, అంగీకం, భంగిమలు వంటివి జూనియర్ ఎన్టీఆరురు బాగా తెలుసని… కళాకారుల గురించి నేను పెద్దగా చెప్పలేనని వెల్లడించారు.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తే అందరికీ అర్థమవుతుందని చెప్పానన్నారు సోమువీర్రాజు. జగనుకు ఉపాధ్యాయుడు అంటే ఎవరో తెలీదని.. విద్యావంతులైన తెలుగు వాళ్లు ప్రపంచం అంతా ఉన్నారన్నారు. ఏ మూలకెళ్లినా కచ్చితంగా పది మందైనా తెలుగు వాళ్లు కన్పిస్తారని.. అలాంటి ఖ్యాతి తెలుగు గడ్డకు ఉందని తెలిపారు. విద్యకు.. ఉపాధ్యాయులకు ఇంత పెద్ద పీట వేసిన రాష్ట్రంలో టీచర్లకు సరైన గౌరవం దక్కడం లేదు… అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానన్న సీఎం జగన్.. ఇప్పుడు మాట మార్చారని వెల్లడించారు.