తెలంగాణ చరిత్రలోనే మరోసారి అత్యధిక విద్యుత్ వినియోగం నమోదయింది. ఈరోజు మధ్యాహ్నం 14750 మెగా వాట్ల విద్యుత్ అత్యధిక పీక్ డిమాండ్ నమోదు అయ్యింది. రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది. సాగు విస్తీర్ణం పెరగడం, రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతుంది.
మొత్తం విద్యుత్ వినియోగంలో 37 శాతం వ్యవసాయ రంగానికి వినియోగిస్తున్నారు. దేశంలో వ్యవసాయ రంగంకు అత్యధిక విద్యుత్ వినియోగం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. మొత్తం విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానం కాగా రెండో స్థానంలో తెలంగాణ నిలిచింది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు 14750 మెగా వాట్లు విద్యుత్ డిమాండ్ నమోదు కాగా.. గత సంవత్సరం ఇదే రోజు గరిష్ట డిమాండ్ 12996 మెగా వాట్లు మాత్రమే నమోదయింది. ఇక నిన్న 14501 మెగా వాట్లు కాగా.. రాష్ట్రం ఏర్పడిన తరువాత అత్యధిక విద్యుత్ డిమాండ్ 14750 రికార్డ్ స్థాయిలో నమోదు ఇదే.
తాజాగా 14750 మెగా వాట్ల విద్యుత్ వినియోగంతో రానున్న రోజుల్లో మరింత డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. గత సంవత్సరం మార్చి నెలలో 14160 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం కాగా ఈసారి డిసెంబర్ నెలలోనే గత సంవత్సరం రికార్డ్ ను అధిగమించి 14501 మెగా వాట్ల విద్యుత్ నమోదు అయింది. తాజాగా 14750 మెగా వాట్ల ఫీక్ విద్యుత్ వినియోగం నమోదయింది. ఈ సంవత్సరం వేసవి కాలంలో 16 వేల మెగావాట్ల డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. డిమాండ్ ఎంత వచ్చిన 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తాం అంటున్నారు ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు.