వాస్తు: అద్దాలని, మొక్కలని అస్సలు ఈ గదిలో ఉంచద్దు.. ఈ తప్పులని కూడా చెయ్యద్దు..!

-

వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఎటువంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి చాలామంది వాస్తు ప్రకారం అనుసరిస్తారు. నిజానికి పండితులు చెప్పినట్లుగా మనం అనుసరిస్తే ఎటువంటి సమస్యలనుండైనా బయటపడవచ్చు. వాస్తు ప్రకారం ఇలా చేశారంటే కచ్చితంగా ఆనందం ఆరోగ్యం మీ వెంట ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు కూడా ఉండవు. ఈ విధంగా మీరు ఆచరిస్తే పాజిటివిటీ పెరుగుతుంది నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

ఇంట్లో కచ్చితంగా పాటించాల్సిన చిట్కాలు:

ముఖద్వారం: ముఖద్వారం ఎంతో ముఖ్యమైనది ఇక్కడ నుండి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ముఖద్వారం ఎదుట ఎటువంటి చెత్తాచెదారం లేకుండా చూసుకోండి. అలానే చెప్పులు షూ వంటి వాటిని ఉంచకండి దీని వలన పాజిటివ్ ఎనర్జీ బ్లాక్ అయిపోతుంది.

ఇంటి రంగులు:

ఇంట్లో ఎప్పుడూ కూడా మంచి ప్రశాంతకరమైన రంగులను ఎంపిక చేసుకోవాలి బాగా డార్క్ కలర్స్ ఉండడం వలన ప్రశాంతత దూరం అవుతుంది.

సరైన వెల్తురు:

ఇంటి లోపల సరైన వెల్తురు ఉండాలి బాగా బ్రైట్ గా ఉండే వెల్తురు కంటే కూడా లైట్ గా ఉండే వాటిని ఎంపిక చేసుకోండి ఇవి కూడా పాజిటివ్ ఎనర్జీని కలిగించేసి నెగటివ్ ఎనర్జీ ని దూరం చేస్తాయి.

ఇంటి లోపల మొక్కలు:

చాలామంది ఇంటి లోపల మొక్కల్ని పెడుతూ ఉంటారు అయితే మొక్కలు పాజిటివ్ ఎనెర్జీని తీసుకువస్తాయి కానీ బెడ్ రూమ్ లో మొక్కల్ని అసలు ఉంచద్దు. దీనివలన నిద్ర సరిగ్గా పట్టదు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

అద్దాలు:

ఇంట్లో అద్దాలు పెట్టేటప్పుడు కూడా పలు చిట్కాల్ని అనుసరించాలి అద్దాలు పాజిటివ్ ఎనెర్జీని తీసుకువస్తాయి అయితే బెడ్ రూమ్ లో అద్దాన్ని ఉంచొద్దు. దీని వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. అలానే ఇంట్లో చెత్తా వంటివి కూడా అసలు ఉంచకండి. వీటి వలన సమస్యలు వస్తాయి అని గుర్తు పెట్టుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news