టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుమార్తెను రేప్ చేస్తాం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టిన 16 ఏళ్ళ బాలుడ్ని గుజరాత్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ లోని ముంద్రాలో అతన్ని ఆదివారం పట్టుకున్నారు. “కొన్ని రోజుల క్రితం ధోని భార్య సాక్షి ధోని… ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన కొన్ని కామెంట్స్ కి సంబంధించి నామ్నా కపాయ గ్రామానికి చెందిన 12 వ తరగతి విద్యార్థిని అదుపులోకి తీసుకున్నాము అని” అని కచ్ (వెస్ట్) పోలీసు సూపరింటెండెంట్ సౌరభ్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.
కెకెఆర్, సిఎస్కె క్రికెట్ జట్ల మధ్య ఐపిఎల్ మ్యాచ్ జరగగా అందులో చెన్నై ఓటమి పాలైంది. అప్పుడు ఈ విధంగా కామెంట్స్ చేసాడు. నిందితుడు కచ్ జిల్లాలోని ముంద్రాకు చెందినవాడు అని రాంచీ పోలీసులు మాకు సమాచారం ఇవ్వడంతో మేము అతనిని అరెస్ట్ చేసామని పోలీసులు పేర్కొన్నారు.