LIC: ఒక్కసారి డబ్బులు పెడితే… జీవితాంతం రూ. 1 లక్ష పెన్షన్..!

-

ప్రతీ ఒక్కరు కూడా ఈ రోజుల్లో స్కీముల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇలా ఇన్వెస్ట్ చేస్తే మంచిగా డబ్బులు వస్తాయి. పదవీ విరమణ తరువాత ఆర్థిక భద్రత కోసం అందరు డబ్బులని పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం వంటివి చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ తరువాత నెల వారీ పెన్షన్ ని పొందుతారు. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్ తప్ప మరే ఆప్షన్ కూడా లేదు. అయితే ఇతర పెన్షన్ పథకాలలో డబ్బు పెట్టుబడి పెట్టకపోతే వృద్ధాప్యంలో ఆర్థికంగా సఫర్ అవ్వాలి.

అయితే ఇలాంటి బాధలేమి లేకుండా ఉండాలంటే ‘సరళ్ పెన్షన్’ స్కీమ్‌ గురించి చూడాల్సిందే. ఈ పథకంలో చాలా మంది ప్రజలు పెట్టుబడి పెడుతున్నారు. పదవీ విరమణ తరువాత నెలకు కొంత మొత్తంలో పెన్షన్ ఈ పథకం లో పొందేందుకు అవుతుంది. సరళ్ పెన్షన్ ప్లాన్‌లో వృద్ధాప్యంలో పెన్షన్ ని తీసుకోవచ్చు. ఈ పథకం లో డబ్బులని 40 నుంచి 80 సంవత్సరాల వయస్సు వారు పెట్టచ్చు. ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే చాలు.

ఈ స్కీము లో మీరు కనీస పెట్టుబడి రూ. 2.5 లక్షలు పెట్టాల్సి వుంది. గరిష్టంగా ఎంతైనా ఈ స్కీము లో మీరు పెట్టొచ్చు. రూ. 2.50 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు రూ .1000 లేదా సంవత్సరానికి రూ .12,000 పెన్షన్ ని పొందేందుకు అవుతుంది. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం ఆప్షన్‌ ని ఎంచుకోవచ్చు. ఈ స్కీమ్‌ లో రూ. 10 లక్షల ప్రీమియం చెల్లిస్తే సంవత్సరానికి రూ. 64,350 పెన్షన్ మీకొస్తుంది. వార్షిక పెన్షన్ రూ. లక్ష కావాలంటే ప్రీమియం రూ. 20 లక్షలు. ప్రీమియం చెల్లించిన 6 నెలల తరువాత లోన్ పొందే అవకాశం కూడా వుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news