మందు బాబులకు గుడ్ న్యూస్.. బీరు తాగితే బరువు తగ్గుతారట..!

-

టైటిల్ చదివి నోరెళ్లబెట్టారా? మీరు నోరెళ్లబెట్టినా పెట్టకున్నా… బీరు తాగితే నిజంగానే బరువు తగ్గుతారట. అయితే.. చాలామంది బీరు తాగితే పొట్ట పెరుగుతుందని.. బరువు పెరుగుతారని చెబుతుంటారు. దాని మీద నిర్వహించన సర్వేల్లో అలా ఏమీ జరగదని తేలింది. లండన్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది.

బీరు తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ రావడం అనేది అబద్ధమట. కొవ్వు పెరగడం, పొట్ట రావడం ట్రాష్ అట. బీరులో ఉండే ఫ్లేవనాయిడ్లు బరువు తగ్గించడానికి తోడ్పడుతాయట. అంతే కాదు.. ఇంకా బీరు తాగడం వల్ల ఎటువంటి మేలు జరుగుతుందో తెలుసుకుందాం పదండి..

 

బ్రిటీష్ మెడికల్ జర్నల్ పబ్లిష్ చేసిన ఓ ఆర్టికల్ లో బీరు తాగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం 24.7 శాతం తగ్గుతుందట. బీరులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు చాలా మేలు చేస్తాయట.

సాధారణంగా వచ్చే కంటి చూపులోపాలు కూడా బీరు తాగడం వల్ల రావట. చాలామందికి వృద్ధాప్యం వల్ల కంటి చూపు తగ్గుతుంది. కానీ.. బీరు తాగడం వల్ల కంటి చూపు సమస్యలు తగ్గుతాయట. కెనడాలో నిర్వహించిన ఓ స్టడీలో ఈ విషయం వెల్లడైంది. ప్రతిరోజు ఓ గ్లాస్ బీరు తాగితే.. కంటి చూపు మెరుగవుతుందట.
బీరులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడుతాయి. వాటిని నాశనం చేస్తాయి. ఒరెగాన్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు నిర్వహించిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది.

బీరు తాగితే ఒత్తిడి కూడా మాయమై పోతుంది. బీపీ ఉన్నవాళ్లు బీరు తాగితే… వాళ్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో ఉంటుందట. ఈ విషయాన్ని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు హైబీపీతో బాధపడుతున్న వ్యక్తులకు బీరు తాగించి అధ్యయనం నిర్వహించారు. హైబీపీతో బాధపడుతున్న వాళ్లకు బీరు తాగాక వాళ్ల బీపీ కంట్రోల్ లో ఉందట.

బీరులో 20 శాతం ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దీని వల్ల శరీరానికి కావాల్సిన ఫైబర్ బీరు ద్వారా అందుతుంది. మనం తినే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండాలి. ఫైబర్ ఎక్కువగా ఉంటే మనం తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతంది.

బీరులో కిడ్నీలలోని రాళ్లను కరిగించే గుణాలు కూడా ఉన్నాయట. బీర్లలో ఉండే పొటాషియం, మెగ్నీషియం కిడ్నీల్లో రాళ్లు కరిగించడానికి సహాయపడుతాయట.
అయితే.. బీర్లు తాగడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి కదా అని చెప్పి రోజూ పీపాలకు పీపాలు లాగిస్తే మాత్రం అది మీ ఆరోగ్యానికే ముప్పు వాటిల్లేలా చేస్తుంది. అందుకే.. ఏదైనా మితంగా తీసుకుంటే మంచిది. అమితంగా తీసుకుంటే మీకు మీరే ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నవారవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news