బిగ్‌ న్యూస్‌ : తెలంగాణలో మరో నోటిఫికేషన్‌.. వివరాలు ఇవే..

-

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఒక్కొక్కటిగా వస్తోన్నాయి. ఎన్నికలు వస్తున్న వేళ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తోంది. వివిధ కారణాల వల్ల గతంలో పెండింగ్ పడిన నోటిఫికేషన్లను కూడా గత కొద్ది నెలలుగా జారీ చేసింది. అందులో భాగంగా మరో నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. రాష్ట్రంలో మెడిక‌ల్ విద్య పూరి చేసుకున్న వారికి తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ‌లో 1147 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువడింది.

ap jobs : 957 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీ-నోటిఫికేషన్ విడుదల-దరఖాస్తు  చేసుకోండిలా! | ap jobs : ap government notification for 957 staff nurse  posts- here are details - Telugu Oneindia

అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ఈ నెల 20న ఉద‌యం 10:30 గంట‌ల నుంచి జ‌న‌వ‌రి 5వ తేదీన సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. మొత్తం 34 విభాగాల్లో 1147 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. 18 నుంచి 44 ఏండ్ల మ‌ధ్య వ‌య‌సున్న వారే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. మొత్తం 1147 పోస్టుల్లో అధికంగా అన‌స్థీషియాలో 155, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీలో 117, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌లో 111 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

పోస్టుల వివ‌రాలు ఇవే..
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, అనాట‌మీ – 26
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, ఫిజియాల‌జీ – 26
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, పాథాల‌జీ – 31
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, క‌మ్యూనిటీ మెడిసిన్(ఎస్‌పీఎం) – 23
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, మైక్రో బ‌యాల‌జీ – 25
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, ఫొరెన్సిక్ మెడిసిన్, టాక్సికాల‌జీ – 25
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, బ‌యోకెమిస్ట్రీ – 20
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, ట్రాన్స్‌ఫ్యూజ‌న్ మెడిసిన్ – 14
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, జ‌న‌ర‌ల్ మెడిసిన్ – 111
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీ – 117
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, పీడియాట్రిక్స్ – 77
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, అన‌స్థీషియా – 155
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, రేడియో డ‌యాగ్నోసిస్ – 46
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, రేడియేష‌న్ అంకాల‌జీ -05
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, సైకియాట్రి – 23

అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, రెస్పిరేట‌రి మెడిసిన్ – 10
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, డెర్మ‌టాల‌జీ – 13
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, ఒబెస్టిట్రిక్స్, గైన‌కాల‌జీ – 142
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, అప్తామాల‌జీ – 08
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, ఆర్థోపెడిక్స్ – 62
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, ఈఎన్టీ – 15
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, హాస్పిట‌ల్ అడ్మిన్ – 14
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, ఎమ‌ర్జెన్సీ మెడిసిన్ – 15
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, కార్డియాల‌జీ – 17
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, కార్డియాక్ స‌ర్జ‌రీ – 21
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, ఎండోక్రైనాల‌జీ – 12
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, గ్యాస్ట్రో ఎంట్రాల‌జీ – 14

అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, న్యూరాల‌జీ – 11
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, న్యూరో స‌ర్జ‌రీ – 16
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, ప్లాస్టిక్ స‌ర్జ‌రీ – 17
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, పీడియాట్రిక్ స‌ర్జ‌రీ -08
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, యూరాల‌జీ – 17
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, నెఫ్రాల‌జీ – 10
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, మెడిక‌ల్ అంకాల‌జీ -01

Read more RELATED
Recommended to you

Latest news