OnePlus Nord N20 SE: రూ. 15 వేలకే 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్

-

వన్‌ప్లస్‌ నుంచి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ వచ్చింది. అదే.. వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ. ఇది అధికారికంగా ఇండియాలో లాంచ్‌ కాలేదు కానీ అందుబాటులో అయితే ఉంది. ఇది ఒక మిడ్‌ రేంజ్‌ ఫోన్.. ఆఫర్లో కొంటే ఇంకా తక్కువగా వస్తుంది. ఈ ఫోన్ మనదేశంలో అధికారికంగా లాంచ్ అవుతుందా, లేకపోతే ఇలా లాంచ్ చేయకుండా విక్రయిస్తారా అన్నది తెలియరాలేదు. ఈ ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్‌ ఎలా ఉన్నాయో చూద్దామా..!

వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ ధర..

ఇందులో కేవలం 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. అమెజాన్‌లో దీని ధర రూ.14,590 కాగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.14,979కే దీన్ని కొనుగోలు చేయవచ్చు.

వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ స్పెసిఫికేషన్లు..

ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ పని చేయనుంది.
ఇందులో 6.56 అంగుళాల డిస్‌ప్లేను అందించారు.
2డీ స్లిమ్ బాడీతో ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.
దీని ప్రాసెసర్ వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు కానీ ఇది మీడియాటెక్ హీలియో జీ35 అయ్యే అవకాశం ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
33W సూపర్‌వూక్ వైర్డ్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
ఈ ఫోన్ 50 శాతం చార్జ్ అవ్వడానికి కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే పట్టనుందని కంపెనీ తెలిపింది.
గతంలో లాంచ్ అయిన ఒప్పో ఏ57 4జీకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయినట్లు తెలుస్తోంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే…

ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు కూడా కెమెరాను అందించారు. ఈ రేంజ్‌లో మార్కెట్‌లో చాలా ఫోన్లు ఉన్నాయి. కాంపిటీషన్‌ అయితే గట్టిగానే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news