కర్నూలు: ఆన్ లైన్ విధానం వద్దని ఉల్లి రైతుల ఆందోళన.. నిరసన దిగిన హమాలీలు.

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలోని ఉల్లి రైతులు నిరసనకు దిగారు. కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉల్లి రైతులు, హమాలీలతో కలిసి పోరుబాట పట్టారు. ఉల్లి అమ్మకం విధానంలో మార్పుల కారణంగా రైతులతో పాటు హమాలీలు నష్టపోతున్నారని, వెంటనే విధానాలను మార్చాలని నిరసన చేపట్టారు. మార్కెట్ యార్డులో ఉల్లి అమ్మకం నిలిచిపోవడంపై ఈ నిరసన మొదలైంది. గత పది రోజులుగా మార్కెట్ యార్డులో ఉల్లి అమ్మకం ఆగిపోయింది.

ఆన్ లైన్ విధానం వల్ల అటు రైతుతో పాటు ఇటు హమాలీలు నష్టపోతున్నారని, ఇది సరికాదని, కలెక్టరేట్ ఎదుట బైటాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. నిలిచిపోయిన మార్కెట్ యార్డును వెంటనే తెరవాలని ఉల్లి అమ్మకం యధావిధిగా కొనసాగాలని డిమాండ్ చేసారు. ఆన్ లైన్ విధానం వల్ల వ్యాపారులు తమ ఉల్లిని కొనుగోలు చేయడం లేదని, మార్కెట్ యార్డులో ఉల్లిని కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news