డెల్టా డేంజర్ బెల్స్… మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులు.. సిద్ధం అంటున్న ప్రభుత్వం

-

మహారాష్ట్రలో కరోనా కేసుల పర్వం కొనసాగుతూనే ఉంది. కొత్తగా వచ్చిన డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో డెల్టా ప్లస్ వేరియంట్ల కేసుల సంఖ్య 27గా ఉంది. మొత్తం కరోనా కేసులు చూసుకుంటే 3643వచ్చాయి. ఐతే మూడవ వేవ్ పట్ల అందరిలో ఆందోళన కనిపిస్తున్న నేపథ్యంలో అటు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. నీతి ఆయోగ్ ప్రకారం దేశ వ్యాప్తంగా 2లక్షలకు పైగా ఐసీయూ బెడ్లు కావాలని సూచించింది.

దీనిలో రాష్ట్రాల వారీగా విభజన చేసింది. ఉత్తరప్రదేశ్ కి 33వేల ఐసీయూ బెడ్లు, మహారాష్ట్రకి 17వేల ఐసీయూ బెడ్లు అవసరమని తేల్చింది. ఇదిలా ఉంటే కరోనా మూడవ వేవ్ ఎదుర్కోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కావాల్సిన మెడికల్ సిబ్బందితో పాటు ఆక్సిజన్ సరఫరా మొదలగు అన్నీ విషయాల్లో సిద్ధంగా ఉండని, కరోనాను ఎదుర్కోవడానికి అన్నీ అస్త్రాలు ఉన్నాయని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news