జూలై 1 నుంచి ఆన్లైన్ తరగతులు : సీఎం కేసీఆర్

-

జూలై 1 నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు పున ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.  జూలై 1 నుండి ఆన్ లైన్ లో పాఠశాల తరగతులు కొనసాగుతాయని…కరోనా దృష్ట్యా పాఠశాలల పున:ప్రారంభాన్ని తాత్కాలికంగా వేయిదా వేస్తున్నట్లు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. జులై 1 నుంచి ఆన్‌లైన్‌లోనే పాఠశాలల తరగతులు జరుగుతాయని స్పష్టం చేేశారు సీఎం కేసీఆర్ . ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రరెడ్డికి సీఎం ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్. ప్రత్యక్ష బోధనకు తొందరేమీ లేదు అని పేర్కొన్నారు. 50 శాతం ఉపాధ్యాయులు హాజరయ్యేలా చూడాలని సూచనలు చేశారు సీఎం కేసీఆర్.

వెంటనే ఆన్ లైన్ క్లాసులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని సబితా ఇంద్రారెడ్డికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అటు ఇంటర్ విద్యార్థులకు కూడా ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతోంది.  అలాగే టీచర్లకు ప్రమోషన్లు, బదిలిలకు కూడా సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news