ఫోన్‌ద్వారా వివిధ రకాల లోన్‌లు ఇచ్చి అ«ధిక వడ్డీలు వసూలు చేస్తున్న ముఠాలన్నీ చైనాకు సంబంధించినవేనని పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్, దిల్లీలల్లో మొత్తం 17 మందిని అదుపులోకి తీసుకున్నట్లు నగర సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. ప్రధాన నగరాలైన దిల్లీ, హైదరాబాద్, గురుగ్రామ్‌లతో పాటు మరికొన్ని పట్టణాల్లో దాదాపుగా ఐదారు నెలల నుంచే ఈ యాప్‌ల ద్వారా లోన్‌లా లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. నగరంలోని బేగంపేట, పంజాగుట్టలలో 30యాప్‌లో కోసం 600 మంది పని చేస్తున్నట్లు తెలిపారు. దిల్లీలోని ఓ కాల్‌సెంటర్‌లో తనిఖీ చేయగా చైనాకు చెందిన ఓ వ్యక్తి పాస్‌పోర్ట్ లభించినట్లు సీపీ తెలిపారు.
ఇవి చాలా ప్రమాదం..
‘క్యాష్ మామా’ అనే యాప్ ద్వారా లోన్‌తీసుకొని తిరిగి చెల్లించినా.. ఇంకా కట్టాలని సంబంధిత నిర్వాహకులు ఒత్తిడి చేశారు. ఈ విషయమై ఓ బాధితుడు డిసెంబర్ మొదటి వారంలో ఫిర్యాదు చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ కేసులు పలువురికి అరెస్ట్ చేసి రూ.1.52 కోట్లు దాదాపుగా 18 ఖాతాలను స్తంభింపజేశామన్నారు. ఇటీవల రాయదుర్గంలోని ఓ బిల్డింగ్‌లో కార్యాలయాలు నిర్వహిస్తున్న «‘దనాధన్‌లోన్’ ‘క్యాష్‌మామా’ ‘లోన్‌జోన్’ యాప్‌ల నుంచి ఇప్పటి దాకా 1.5 లక్షల మంది లోన్లు స్వీకరించినట్లు గుర్తించారు. కోకాపేటకు చెందని సీఈఓ శరత్‌చంద్ర, పుష్పలత, వాసవ చైతన్య, సచిన్ దేష్‌ముఖ్, వెంకటేష్, సయ్యద్ ఆశిక్‌ను ఇప్పటికే అరెస్టు చేశారు.
సృషించి అమ్మేశాడు..
‘క్యాష్‌మామా’ «‘దనాధన్‌లోన్’ ‘లోన్‌జోన్’, ‘క్యాష్‌అప్’ ‘మేరాలోన్’ ‘క్యాష్‌బస్’ ‘క్యాష్‌జోన్’ అనే ఏడు రకాల యాప్‌లను సృష్టించిన ప్రధాన నిందితుడు శరత్‌చంద్ర అందులో కొన్నింటిని ఏషియా ఇన్నో నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లూషీల్ట్ ఫిన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు అమ్మేశాడు. మరికొన్నింటికి ఆనియాన్ క్రిడిట్ కంపెనీ, క్రెడ్ ఫాక్స్ టెక్నాలజీస్‌కు లింక్ చేశాసినట్లు పోలీసులు గుర్తించారు.