ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఒంటి మిట్ట కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం రామయ్య బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయి.. 19 వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కాగ ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 15వ తేదీన సీతా రాముల కళ్యాణం జరుగుతుంది. ఈ నెల 15న రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపు కల్యాణం జరగనుంది.
కాగ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత రెండు సంవత్సరాల నుంచి శ్రీ రామనవమిని నిరాడంబరంగా నిర్వహించారు. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో ఘనంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ కల్యాణ వేడుకలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఈ రోజు టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్. జవహార్ రెడ్డి, ఒంటి మిట్ట ఆలయ ఈవో డాక్టర్ రమణ ప్రసాద్.. 15వ తేదీన జరగబోయే.. సీతారాముల కల్యాణానికి హజరు కావాలని ఆహ్వన పత్రిక అందించారు. రామయ్య.. తీర్థ ప్రసాదాలను సీఎం జగన్ కు అందించారు.