చైనీస్ స్మార్ట్ బ్రాండ్ ఒప్పో సంస్థ తాజాగా ఒప్పో A58 5G ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఇది ఒక మిడ్ రేంజ్ ఫోన్..డ్యుయల్ మోడ్ 5G సపోర్ట్, 50 MP డ్యుయల్ రియర్ కెమెరా సెటప్, 5,000 mAh బ్యాటరీ.. వంటి ఫీచర్లతో ఫోన్ రిలీజ్ అయింది. ఈ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను ఇతర దేశాల్లో రిలీజ్ చేసే విషయంపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇంకా ఫోన్ ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా..!
ధర ఎంత?
ఒప్పో A58 5G ఫోన్ ప్రీ బుకింగ్స్ చైనాలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీని సేల్స్ చైనాలో నవంబర్ 10న నుంచి ప్రారంభమవుతాయి. ఇది 8 GB RAM, 256 GB ROM వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. చైనాలో దీని ధర CNY 1.699 అంటే.. సుమారు రూ. 19,000గా ఉంది.
ఫీచర్లు..
ఒప్పో A58 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
90Hz వరకు రిఫ్రెష్ రేట్ ఉండే 6.56 అంగుళాల HD+ (720X1,612 పిక్సెల్స్) డిస్ప్లే, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్.. యూజర్లకు బెస్ట్ అవుట్‌పుట్ అందిస్తుంది.
ఈ హ్యాండ్సెట్ 163.8×75.04×7.99mm కొలతలతో 188g బరువు ఉంటుంది.
ఫోన్లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది.
33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది.
ఇది 8.5 గంటల గేమింగ్ టైమ్‌ను అందిస్తుంది.
ఈ హ్యాండ్సెట్ స్టార్ బ్లాక్, బ్రీజ్ పర్పుల్, ట్రాంక్విల్ సీ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది
కెమెరా కెపాసిటీ..
ఒప్పో A5G 5G ఫోన్లో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది.
ఇందులో f/1.8 ఎపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.4 ఎపర్చర్‌తో 2 MP పోర్ట్రెయిట్ సెన్సార్ ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం f/2.0 ఎపర్చర్‌తో 8 MP ఫ్రంట్ కెమెరాను అందించారు.
ఈ కెమెరాలు 30fps వద్ద ఫుల్-HD వీడియోలను రికార్డ్ చేయగలవని కంపెనీ తెలిపింది.