ప్రధాని మోదీ విశాఖ పర్యటనపై తీవ్ర విమర్శలు గుప్పించారు సిపిఐ రామకృష్ణ. ఉత్తరాంధ్ర నుంచి భారీ ఎత్తున మోదీ సభకు ప్రజలను తరలించారని ఆరోపించారు. ప్రభుత్వం జనాల్ని సభకు తరలించడంలో విజయవంతం అయ్యిందని ఎద్దేవా చేశారు. సభలో ప్రధాని ఒక్క అభివృద్ధి అంశం గురించి కూడా మాట్లాడలేదని దుయ్యబట్టారు సిపిఐ రామకృష్ణ. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు గురించి ఉసే లేదన్నారు. మోదీ టీఆర్ఎస్, కాంగ్రెస్ కు భయపడి సింగరేణి ని ప్రైవేట్ పరం చేయనన్నారని ఎద్దేవా చేశారు.
మరి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయబోమని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. పార్లమెంట్ లో సంఖ్యబలం వున్న ఒక్క ఎంపీ కూడా ప్రశ్నించాడా? అన్నారు రామకృష్ణ. జగన్ అటెండర్ మాదిరి మోదీ విశాఖ పర్యటనలో సార్, సార్ అంటూ వెంటబడ్డాడని ఎద్దేవా చేశారు. ఈనెల 16 నుంచి అన్ని జిల్లాల్లో ఉమ్మడిగా నిరసనలు చేపడతామన్నారు. ప్రత్యేక హోదా పై 26న ఢిల్లీ లో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామన్నారు రామకృష్ణ.