ఒప్పో నుంచి కొత్త ఫోన్ చైనాలో లాంచ్ అయింది. దీని ధర కూడా పదిహేను వేలు పైనే ఉంది. మొత్తం మూడు వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ ఓఎస్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. ఇంకా ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఒప్పో కే10ఎక్స్ ధర..
ఇందులో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,499 యువాన్లుగా అంటే సుమారు రూ.17,000గా ఉంది.
ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,699 యువాన్లు అంటే సుమారు రూ.19,300గా నిర్ణయించారు.
12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,999 యువాన్లుగా అంటే సుమారు రూ.22,700గా ఉంది.
సెప్టెంబర్ 22వ తేదీ నుంచి చైనాలో దీని సేల్ జరగనుంది.
ఒప్పో కే10ఎక్స్ స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.59 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీపై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఒప్పో కే10ఎక్స్ స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.59 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీపై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై ఒప్పో కే10ఎక్స్ పనిచేయనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 67W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
హీట్ డిస్సిపేషన్ సిస్టం కూడా ఈ ఫోన్‌లో ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే…
ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.