ఏపీ ఆర్థిక పరిస్థితి బాగుంటే ఉద్యోగుల జీతాలు ఆలస్యం ఎందుకు అవుతున్నాయి – పయ్యావుల కేశవ్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటే ఉద్యోగుల జీతాలు ప్రతినెలా ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ప్రశ్నించారు టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో రిటైర్డ్ ఉద్యోగులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. ఉద్యోగులు చనిపోతే కర్మకాండలకు ఇచ్చే నిధులను కూడా దారి మళ్ళించారని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ సరిగా లేని కారణంగానే బిల్లులు చెల్లించలేక మందుల సరఫరా, చిన్నపిల్లలకు ఇచ్చే చిక్కీలు, పాలను కూడా ప్రభుత్వం ఆపేసిందని విమర్శించారు.

కొన్ని పథకాల అమలుకు డబ్బులు లేవని కోర్టులో ప్రభుత్వం అఫీడబిట్ దాఖలు చేసింది నిజం కాదా ? అని ప్రశ్నించారు. అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసి.. సీఎం జగన్ ఇష్టం వచ్చిన లెక్కలు చెప్పారని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగా అనే ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పారని అన్నారు. స్పీకర్ ఫుల్ దేమ్ అవుట్ అని టిడిపి సభ్యులను ఉద్దేశించి ఎలా అంటారని.. స్పీకర్ అనే వ్యక్తి ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ ది హౌస్ అనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news