ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే ఆయా పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తిరుపతి కూటమి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులను ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే ఆయన అభ్యర్థిత్వంపై కిరణ్ రాయల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.తిరుపతి కూటమి అభ్యర్థిని వ్యతిరేకిస్తున్నామని జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ అన్నారు. ఆరణి శ్రీనివాసులు తమకు సహకరించడంలేదని మండిపడ్డారు. సీనియర్లకు సీటు రాకపోవడం చాలా బాధగా ఉందని అన్నారు.నామినేటెడ్ పోస్టు వస్తాయని ఆశిస్తున్నామని తెలిపారు.
కాగా తిరుపతి సీటును కిరణ్ రాయల్ ఆశించగా,కూటమిలో భాగంగా ఆరణి శ్రీనివాసులుకి టికెట్ వెళ్లింది. దీంతో తిరుపతి జనసేన నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. చిత్తురు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులు కొద్ది రోజుల క్రితమే జనసేనలో చేరారు. దీంతో తిరుపతి సీటును శ్రీనివాసులకు కేటాయించారు. అయితే స్థానిక నేతలు మాత్రం ఆరణి అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.