కేంద్రంతో ఢీ అంటే ఢీ.. అమీతుమీకి సిద్ధమైన రాహుల్ టీమ్

-

న్యూఢిల్లీ: కేంద్రంతో ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి. రైతుల విషయంలో కేంద్రాన్ని దోషిగా నిలబట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. పెగాసస్‌‌పై కేంద్ర తీరును తప్పుబడుతున్నాయి. కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఈ మేరకు ప్రధాన ప్రతిపక్ష‌మైన కాంగ్రెస్ పార్టీ… మిగిలన పక్షాలతో కలిసి ఉమ్మడి పోరాటం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ మిగిలిన వివక్ష ఎంపీలతో సమావేశమయ్యాయి.

 

మరోవైపు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న రైతుల ఆందోళనకు మద్దతివ్వాలని నిర్ణయించారు. కాసేపట్లో జంతర్ మంతర్ వద్దకు వెళ్లి రైతులతో కలిసి ధర్నాలో పాల్గొనే అవకాశం ఉంది. కేంద్ర తీసుకొచ్చిన రైతు చట్టాలను రైతులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాను కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు ప్రతిపక్షాల మద్దతు పెరగడంతో ఈ అందోళన మరింత ఉధృతమయ్యే అవకాశం కనిపిస్తోంది.

 

కాగా ఇప్పటికే పార్లమెంట్ ఉభయసభల్లో విపక్ష పార్టీలన్నీ ఒకటయ్యాయి. పెగాసస్‌పై ఉభయ సభల్లోనూ చర్చ పెట్టాల్సిందేనని పట్టుబట్టాయి. మరోవైపు పెగాసస్ అంశంపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ, రాజ్యసభలోనూ కేంద్రంపై ఉమ్మడిగా ఒత్తిడి తీసుకురావాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news