ప్రతిపక్షాలు నాకు ప్రధాని పదవిని ఆఫర్ చేశాయి : గడ్కరీ

-

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.లోక్‌సభ ఎన్నికలకు ముందు ఒక సీనియర్ అపోజిషన్ లీడర్ తనకు ప్రధాన మంత్రి పోస్టును ఆఫర్ చేశారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. తాను పదవికోసం విలువలను తాకట్టు పెట్టనని, అందుకే ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలిపారు. నాగ్‌పూర్‌లో జర్నలిజం అవార్డ్స్ ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు.

జర్నలిస్టులు కన్విక్షన్, కమిట్‌మెంట్‌తో ఉండాలని సూచించారు. తనకు ప్రధాని పదవి ఆఫర్ చేసిన లీడర్ పేరును మాత్రం ఆయన రివీల్ చేయలేదు.కాగా, నితిన్ గడ్కరీ కేంద్ర రోడ్లు,భవనాల శాఖామంత్రిగా అద్భుతమైన పనితీరును కనబరిచిన విషయం తెలిసిందే.ఇప్పటికే ఆయన పనితీరుకు నిదర్శనంగా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సైతం వరించిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు సైతం ఆయన పనితీరును పలుమార్లు ప్రశంసించాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version