ఇవాళ విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖలో ఖాళీల భర్తీపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌ఈఆర్‌టీ ఇచ్చిన సిఫార్సులు అన్నీకూడా అమల్లోకి రావాలన్న సీఎం జగన్ .. మండల రీసోర్స్ సెంటర్ పేరును మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంగా మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎండీఓ పరిధిలో కాకుండా ఎంఈవోకే నేరుగా డ్రాయింగ్ అధికారాలు ఇవ్వాలని.. ఇకపై విద్యాసంబంధిత కార్యకలాపాలు ఎంఈవోకే అప్పగిస్తూ ఎస్‌ఈఆర్‌టీ సిఫార్సుకు సీఎం ఆమోదం తెలిపారు.
అలాగే.. ఎంఈఓ పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పలురకాల ఆప్స్ కన్నా… రియల్‌టైం డేటా ఉండేలా, డూప్లికేషన్ లేకుండా చూడాలన్న ఎస్‌ఈఆర్‌టీ సిఫార్సును అమల్లోకి తీసుకు రావాలన్నారు. అటెండెన్స్‌ను ఫిజికల్‌గా కాకుండా ఆన్‌లైన్ పద్ధతుల్లో తీసుకోవాలన్న సిఫార్సునూ అమలు చేయాలని పేర్కొననారు. విద్యార్ధుల మార్కులనూ ఆన్‌లైన్‌లో ఎంట్రీచేయాలని.. ఇప్పుడు ప్రతి మండలానికి రెండు స్కూళ్లను 2 జూనియర్ కాలేజీలుగా మార్చండన్నారు సీఎం జగన్.