Rashmika Mandanna : గృహ ప్రవేశం పనుల్లో రష్మిక మందన్న బిజీ..ఫోటోలు వైరల్‌

-

నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రష్మిక మందన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు వరుస క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా అనేక సినిమాల్లో నటించిన రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది.

ఇది ఇలా ఉంటే నిన్న ఆమె తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో చేసిన కామెంట్‌ వైరల్‌ గా మారింది. సామాన్లు ప్యాక్‌ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నానని ఆమె పేర్కొంది. దీంతో ఆమె కొత్త ఇల్లు కొనుక్కుందా… అనే చర్చ సోషల్‌ మీడియాలో జరుగుతోంది. వాస్తవానికి 2021 ఫిబ్రవరిలోనే ముంబైలో రష్మిక ఒక ఇంటిని కొనుగో చేసింది.

బాలీవుడ్‌ లో నటిస్తున్న నేపథ్యంలో ఆమె ముంబైలో సొంత ఇంటిని ఏర్పాటు చేసుకుంటోంది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్‌ లో మిషన్‌ మజ్ను, గుడ్‌ బై అనే రెండు సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో హోటళ్లలో బస చేయకుండా… సొంత ఇంటికి మారే ప్రయత్నంలో రష్మిక ఉంది. కాగా…తెలుగులో పుష ది రూల్‌ సినిమా షూటింగ్‌ కు ఆమె సిద్ధమౌవుతోంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌ లో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news