ఏపీ ఉద్యోగులు జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్న ఐఏఎస్సులను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని పిలుపు నిచ్చారు. వచ్చే రెండేళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయని.. మేం కూడా ప్రజల్లో భాగమేనని పేర్కొన్నారు ఏపీ ఉద్యోగులు. మేమూ అప్పుడు గట్టిగానే గుద్దుతాం..జగన్ సర్కార్ కు బుద్ది చెబుతామని హెచ్చరించారు.
విజయవాడ దద్ధరిల్లిందని.. ప్రభుత్వం ఎంత చెప్పినా వినకుండా కొత్త జీతాలు వేసిందని నిప్పులు చెరిగారు. మనకు పే స్లిప్పులు కూడా అర్థం కావా..? ఐఏఎస్సులకే పే స్లిప్పులు అర్థమవుతాయా..? అని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘ నేతలుగా మేం చేసిన పొరపాటు గుర్తించామని.. ప్రసంగాలు ఇవ్వడానికి మేం రాలేదు.. ఉద్యోగుల ఆవేదనను తెలియచెప్పేందుకే వచ్చామని పేర్కొన్నారు. ఉద్యోగులుగా మనం తగ్గేదేలేదని… సగటు ఉద్యోగికి న్యాయం చేసేందుకే ఈ ఉద్యమమని చెప్పారు. విజయవాడలో ఉద్యోగులు చేసే నినాదాలు తాడేపల్లికి తాకాలని.. అందరికీ న్యాయం చేస్తామన్నారు.. ఏం చేశారు..? అని ఫైర్ అయ్యారు.