న్యాయవాది పేరుతో అక్రమాలకు పాల్పడుతూ.. వ్యాపారస్తులను వేధిస్తున్న న్యాయవాది బసంత్ సోనీ పై చర్యలు తీసుకోవాలని ఉస్మాన్ గంజ్ మార్కెట్ బంద్ పెట్టి నిరసన తెలుపుతున్నారు వ్యాపారస్తులు. గోశామహల్ లోని న్యూ ఉస్మాన్ గంజ్ మార్కెట్, రేసాలఅబ్దుల్లా, స్టెస్నరి మార్కెట్ బంద్ పెట్టి నిరసన తెలుపుతున్నారు వ్యాపారస్తులు.
గోశామహల్ లో ఎక్కడ నూతన భవనం నిర్మాణం జరిగితే అక్కడ అడ్వాకేట్ బసంత్ సోనీ వాడు పోతున్నాడని వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. జాంబాగ్ లో నిర్మాణం జరుగుతున్న భవనం పై కేసులు వేసి వేధిస్తున్న వేధింపులకు యజమాని ప్రకాష్ కుమార్ అనారోగ్యంతో ఆసుపత్రుల పాలయ్యాడని అంటున్నారు. నిర్మాణంలో ఉన్న భవనాలపై అక్రమంగా కేసులు వేయించి వారినుండి 20నుండి 30లక్షల వరకు డిమాండ్ చేస్తున్నాడని వ్యాపారస్థూల ఆరోపణ.
బసంత్ సోనీ న్యాయవాది వేధింపుల నుండి తమకు రక్షణ కల్పించాలని బాధిత ప్రకాష్ జైన్ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయవాది బసంత్ వేధింపులకు గురై ప్రకాష్ కుమార్ జైన్ ఆసుపత్రి పాలై ఇప్పటికీ 80లక్షల వరకు కార్చుపెట్టినా బసంత్ సోనీ వదలడం లేదని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, జిహెచ్ఎంసి అధికారులు స్పందించి అక్రమాలకు పడుతున్న న్యాయవాది బసంత్ సోనీ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.