ఒక్కొక్కసారి మనం షూ వేసుకుంటే మనకి కరిచినట్లు అనిపిస్తుంది. పైగా పాదం పైన వుండే చర్మం కమిలిపోతుంది. మీకూ ఎప్పుడైనా జరిగిందా..? ఇలా పాదాలకి వచ్చే సమస్య నుండి బయటపడేందుకు ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. అయితే మరి షూ కరిస్తే ఎలా దాని నుండి బయటపడొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.
టూత్ పేస్ట్ ని అప్లై చేయండి:
ఒక్కొక్కసారి షూ వేసుకోవడం వలన మనకి చర్మం కమిలిపోతూ ఉంటుంది అటువంటప్పుడు టూత్ పేస్ట్ ని అప్లై చేయడం వలన సమస్య నుండి బయటపడడానికి అవుతుంది. షూ కరిచింది అంటే టూత్ పేస్ట్ ని అప్లై చేస్తే మంచిది. ఇది చక్కగా పనిచేస్తుంది టూత్ పేస్ట్ అప్లై చేసిన తర్వాత మీరు కాసేపు వదిలేసి తర్వాత క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోండి ఆ తర్వాత పెట్రోలియం జెల్లీని అప్లై చేస్తే మంచిది.
ఐస్ క్యూబ్ ని పెట్టండి:
ఒక క్లాత్ తీసుకుని అందులో ఐస్ క్యూబ్స్ వేసి పాదాల దగ్గర అప్లై చేయండి ఇలా చేయడం వలన సమస్య నుండి బయట పడొచ్చు.
యాంటీబయటిక్ క్రీమ్ ని రాయండి:
చర్మం కనిలిపోవడం వలన బ్యాక్టీరియా వంటివి చేరే అవకాశం ఉంటుంది అప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి యాంటీ బయటిక్ క్రీమ్ ని అప్లై చేయండి.
షూ ని తొలగించి చెప్పులు ధరించండి:
షూ వలన సమస్య కలిగితే వెంటనే చెప్పులు వేసుకోండి దీనితో కాలికి గాలి ఆడుతుంది ఇలా ఈ చిట్కాలని ఫాలో అయితే సమస్య నుండి సులభంగా బయట పడచ్చు.