ఉస్మానియాలో అరాచకం… రూ.1000 ఇస్తేనే మార్చరీలోకి అనుమతి

-

ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమంది సిబ్బంది రోగులను రాబందుల్లా పీక్కుతింటున్నారు. పైసల కోసం అలవాటు పడిన సిబ్బంది రోగులు, పేటెంట్ల కుటుంబాల వద్ద నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. ఇటీవల ఏపీలో ఇలాగే అంబులెన్స్ మాఫియా కారణంగా తన కొడుకు మృతదేహాన్ని టూవీలర్ పై తరలించడం మనం చూశాం. 

ఇదిలా ఉంటే తాజాగా ఉస్మానియా ఆస్పత్రిలోని సిబ్బంది రోగుల బంధువుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ అరాచకానికి తెరతీశారు. రూ.1000 ఇస్తేనే మృతదేహాన్ని తీసుకుంటామని ఉస్మానియా మార్చురీ సిబ్బంది జులుం ప్రదర్శించడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్ నగర్ లో రాత్రి మహమ్మద్ మజీద్ ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డారు. పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులతో ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మద్యం మత్తులో విధుల్లో ఉన్న సిబ్బంది రూ.1000 ఇస్తేనే మృతదేహాన్నీ తీసుకుంటావని…బాధిత బంధువులతో వాగ్వివాదానికి దిగాడు. ఎంతగా నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నాడు. దీంతో గంటల పాటు మార్చురీ ముందే శవంతో వేచి వుండే పరిస్థితి ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Latest news