వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరికి రక్షణ కల్పించాలంటూ డిజిపి కి లేఖ రాసిన వర్ల రామయ్య

-

వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిపై, సిబిఐ అధికారులపై స్థానిక పోలీసులు తప్పుడు కేసులు పెట్టడం మానుకొని వారికి తగిన భద్రత కల్పించాలంటూ డీజీపీకిి లేఖ రాశారు టీడీపీ నేత వర్ల రామయ్య. హైకోర్టు ఆదేశాల మేరకు వివేకా హత్య కేసు సిబిఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారినప్పటినుండి దస్తగిరి ప్రాణహాని ఉంది. అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు దస్తగిరి పై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

స్థానిక పోలీసులు సిబిఐ బృందాన్ని కూడా విడిచి పెట్టడం లేదన్నారు. సిబిఐ దర్యాప్తు అధికారిపై సైతం తప్పుడు కేసులు పెట్టారని పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉండడంతో వారి ఆదేశాల మేరకే పోలీసుల వ్యవహార శైలి ఉందని ప్రజలు అనుకుంటున్నారు అని అన్నారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి కి, సిబిఐ అధికారులకు సరైన భద్రత కల్పించడం చాలా ముఖ్యమన్నారు. దస్తగిరి కి గాని, సిబిఐ దర్యాప్తు అధికారులకు గానీ ఏదైనా హాని జరిగితే వైసీపీ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కావున అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకు కాకుండా రాజ్యాంగం ప్రకారం పోలీసులు నడుచుకోవాలని లేఖలో పేర్కొన్నారు వర్ల రామయ్య.

Read more RELATED
Recommended to you

Latest news