యుఎస్ బయోటెక్ కంపెనీ మోడెర్నా సోమవారం తన కరోనా వైరస్ వ్యాక్సిన్ కి సంబంధించి కీలక ప్రకటన చేసింది. తమ వ్యాక్సిన్ బలంగా పని చేస్తుంది అని ప్రకటన చేసింది. కరోనాను ఎదుర్కోవడంలో 94.5 శాతం ప్రభావవంతంగా ఉందని ప్రకటించింది. ఇక ఫార్మా దిగ్గజం జాన్సన్ & జాన్సన్ తన కోవిడ్ -19 వ్యాక్సిన్ రెండు- మోతాదు చివరి దశ ట్రయల్స్ ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా 30,000 మంది ఈ ట్రయల్స్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఇక మన హైదరాబాద్ కి చెందిన భారత్ బయోటెక్ తన కోవాక్సిన్ కరోనా వైరస్ వ్యాక్సిన్ చివరి దశ ట్రయల్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ ట్రయల్స్ లో 26,000 మంది పాల్గొంటారు. మోడెర్నా మరియు ఫైజర్ తమ కరోనా వ్యాక్సిన్ అత్యంత ప్రభావంగా ఉన్నట్టు ప్రకటన చేసాయి.