ప్రపంచంలోని అన్ని దేశాల కంటే అమెరికాలోనే కరోనా భీభత్సం ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకూ 11మిలియన్ల కరోనా కేసులు నమోదయ్యాయి. సుమారు 2లక్షల 40వేల మందికి పైగా కరోనా కారణంగా మరణించారు. ఐతే తాజాగా కరోనా లెక్కలు అమెరికాని ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన వారంలో అమెరికాలో మిలియన్ కేసులు నమోదయ్యాయి. కేవలం ఆరు రోజుల్లోనే ఈ రేంజిలో కరోనా విజృంభించడం అంటే మామూలు విషయం కాదు. ఒక్క శనివారం రోజే 1300మంది కరోనాతో చనిపోయారు.
ఈ స్థాయిలో కేసులు రికార్డవడం ఇదే మొదటిసారి. కరోనా కారణంగా ఆగిపోయిన వ్యాపారలన్నీ తెరుచుకుంటున్న వేళ రికార్డు స్థాయిలో కేసులు నమోదవడం భయాన్ని కలిగిస్తుంది. ఐతే ఇంకా స్కూల్స్, కాలేజీలు మాత్రం తెరుచుకోవడం లేదు. ప్రస్తుతానికి అమెరికాలో ఆన్ లైన్ క్లాసులనే నిర్వహిస్తున్నారని సమాచారం.