దేశంలో ఆక్సీజన్ కొరత తీవ్ర స్థాయిలో ఉంది. ఆక్సీజన్ ని కేంద్రం రాష్ట్రాలకు భారీగా పంపించే ప్రయత్నాలు చేస్తున్నా సరే అనుకున్న విధంగా పరిస్థితి కనపడటం లేదు అనే చెప్పాలి. అయితే ఆక్సీజన్ కొరతకు ప్రధాన కారణం ఉత్పత్తి కాదని అంటుంది కేంద్రం. ఆక్సీజన్ ఉత్పత్తి అవసరానికి మించి ఉందని చెప్తుంది. కాని సరఫరా చేయడంలోనే సమస్యలు ఉన్నాయని చెప్తుంది.
క్రయోజనిక్ ట్యాంక్ లు లేవని, దేశంలో 1100 వరకే ఆ ట్యాంక్ లు ఉన్నాయని కేంద్రం తెలిపింది. కాబట్టి ఇప్పుడు వాటి దిగుమతి మీద దృష్టి పెట్టామని చెప్పింది. విదేశాల నుంచి 20 ట్యాంక్ లను తక్షణమే దిగుమతి చేసుకుంటున్నామని తెలిపింది. ట్యాంక్ లు ఉంటే రాష్ట్రాలకు కొరత లేకుండా ఆక్సీజన్ అందిస్తామని పేర్కొంది.