పాక్ ను కూడా కలవరపరుస్తున్న గులాబ్ తుఫాన్..

గులాబ్ తుఫాన్ కారణంగా దేశంలోని తెలంగాణ, ఒడిశా, చత్తీస్గడ్, ఏపీ, మహరాష్ట్రను కలవరపెట్టింది. తుఫాన్ కారణంగా ఈరాష్ట్రాల్లో కుండపోత వర్షాలు వరదలు సంభవించాయి. ప్రస్తుతం గులాబ్ తుఫాన్ దాయాది దేశమైన పాకిస్తాన్ ను కూడా కలవరపరుస్తోంది. ప్రస్తుతం గులాబ్ ఈశాన్య దిశగా గుజరాత్, పాకిస్తాన్ వైపు కదులుతోంది. దీంతో పాకిస్తాన్ లో అల్పపీడనం ఏర్పడి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోం

ది. ముఖ్యంగా పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పాక్ వాణిజ్య రాజధాని అయిన కరాచీలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. కరాచీతో పాటు పాక్ లోని ఇతర నగరాలు అయిన హైదరాబాద్( సింధ్), మీర్పూర్ ఖాస్, జకోబాబాద్, లార్ఖానా, గ్వాదర్ వంటి పట్టణాలపై కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని పాక్ వాతావరణ శాఖ హెచ్చిరిస్తోంది. గత వారం కురిసిన వర్షాలకే కరాచీలోని పలు కాలనీలు నదులను తలపించడంతో అధికారులు అప్రమత్త చర్యలు తీసుకుంటున్నారు. 2021లో ఏర్పడిన తౌట్కే, యాస్, గులాబ్ తుఫానులకు పాకిస్తానే పేర్లను ప్రతిపాదించింది.