రజినీకాంత్ చనిపోవడంపై … సర్కారు సీరియస్

ఇటీవల మణికొండల నాలాలో పడి మరణించిన ఇంజనీర్ రజినీకాంత్ ఘటనపై తెలంగాణ సర్కారు సీరియస్ అయింది. అందుకు కారణమయిన మున్సిపల్ ఏఈని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గులాబ్ తుఫాను కారణంగా హైదరాబాద్లో భారీ వర్షాలు కురియడంతో నాలాలు ఉప్పొంగాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం మణికొండలో నాలాలో ఇంజనీర్ రజినీకాంత్ గల్లంతయ్యాడు. పెరుగు ప్యాకేట్ కోసం వచ్చి నాలాలో పడిపోయాడు. దాదాపు మూడు రోజులు గాలింపు చర్యలు జరిపినా రజినీకాంత్ ఆచూకీ లభించలేదు. మూడు రోజుల అనంతరం నెక్నాపూర్ చెరువులో శవంగా తేలాడు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని విమర్శించాయి. మరణించిన

రజినీకాంత్ కుటుంబాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. దీంతో ఈఘటనను సర్కారు సీరియస్ గా తీసుకుంది. నిర్లక్ష్యానికి కారణమైన మున్సిపల్ ఏఈతో పాటు సదరు కాంట్రాక్టర్ పై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఉపక్రమించింది. ఈ ఘటనతో మేల్కొన్న సర్కారు వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంది.