భారత్‌పైకి 500 డ్రోన్లతో అటాక్.. భారత్ ఆర్మీ వర్గాలు వెల్లడి

-

గురువారం రాత్రి పాకిస్తాన్ భారతపై ఘోరమైన కుట్రకు పాల్పడింది. మే 8 రాత్రి 8 గంటల నుంచి 11 గంటల మధ్య, భారత గగనతలంలోకి దూసుకొచ్చేలా సుమారు 500 డ్రోన్లను పంపినట్లు భారత రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో ప్రధానంగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని 24 ప్రాంతాలు లక్ష్యంగా మారాయి. అయితే భారత్ ముందుగానే అప్రమత్తమై, L70, ZU-23, షిల్కా, ఆకాష్ వంటి ఆధునిక గగనతల రక్షణ వ్యవస్థల సాయంతో పాకిస్తాన్ డ్రోన్ల దాడిని విజయవంతంగా అడ్డుకుంది. ఈ డ్రోన్లలో ఎక్కువగా ఆయుధాలు లేని చిన్న డ్రోన్లు ఉండగా, వాటిని భారత సైనిక స్థావరాలపై నిఘా పెట్టడం లేదా ప్రజల్లో భయం కలిగించడమే ప్రధాన ఉద్దేశంగా రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.

Pakistan Targets Jammu Airstrip, India Thwarts Strikes
 

డ్రోన్లతోపాటు, 8 క్షిపణులు కూడా పాకిస్తాన్ నుండి భారత సరిహద్దులోని సత్వారీ, సాంబా, ఆర్‌ఎస్ పురా, అర్నియా ప్రాంతాలపై ప్రయోగించబడ్డాయి. ఇజ్రాయిల్‌పై హమాస్ జరిపిన దాడుల తరహాలోనే ఈ కుట్రను పాకిస్తాన్ రచించినట్టు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇకపోతే, బుధవారం తెల్లవారుజామున భారత సైన్యం నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” ద్వారా పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK), పాకిస్తాన్‌లోని 9 కీలక ప్రాంతాల్లో మొత్తం 24 దాడులు జరిపి, జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలకు చెందిన 100 మంది ఉగ్రవాదులను నిష్పక్షపాతంగా అంతమొందించారు.

ఈ పరస్పర చర్యల ద్వారా భారత్ తన భద్రతా పరిరక్షణలో ఎంతదూరం ముందుందో మరోసారి రుజువైంది. పాకిస్తాన్ దుష్ట పన్నాగాలను భారత సైన్యం సమర్థవంతంగా అడ్డుకోవడం గర్వించదగిన విషయంగా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news