పాకిస్థాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని.. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు అందించలేక పోతోందని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లో కోత విధిస్తున్న పాక్ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలనూ అదుపు చేయలేకపోతోంది. ధరల పెరుగుదల భారాన్ని తగ్గించుకునేందుకు అక్కడ ప్రజలు వంటగ్యాస్‌ను ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసుకుంటుండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
తీవ్ర ద్రవ్యోల్బణంతోపాటు పెట్రోలియం, గ్యాస్ నిల్వలు తగ్గిపోవడం, పతనమవుతున్న కరెన్సీ విలువ వంటి అంశాలు పాకిస్థాన్‌ను వెంటాడుతున్నాయి. దీంతో సబ్సిడీల భారాన్ని మోయలేక చాలా వాటికి కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అక్కడ అనేక ప్రాంతాలను వంటగ్యాస్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా ఖైబర్ పఖ్తూంఖ్వాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇక్కడి ప్రజలు వంటగ్యాస్‌ను ప్లాస్టిక్ కవర్లలో నిల్వచేసుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.
Residents of Karak carry gas for their household needs in plastic bags because there is no natural gas supply to residences.
The Pakistani establishment has totally failed here!
1/2@husainhaqqani pic.twitter.com/QBqf0XX1PR— Tahreem Akhtar (@Tahz42) January 2, 2023