ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేసారు. తమని తెలంగాణ ప్రభుత్వంలోకి తీసుకుంటున్నందుకు సంతోషంతో ఈ విధంగా దన్యవాదాలు తెలుపుకున్నారు. మొత్తం 700మంది ఉద్యోగులు ఆనంద హర్షాతిరేకాల్లో మునిగిపోయారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినపుడు కొన్ని కారణాల వల్ల ఈ 700మంది ఉద్యోగులు అక్కడే ఉండాల్సి వచ్చింది. 2014నుండి ఇప్పటి వరకు వాళ్ళు అక్కడే పని చేసుకున్నారు.
తమని సొంతరాష్ట్రంలోకి తీసుకోవాలని చాలా రోజులుగా తెలుపుతూనే ఉన్నారు. ఎట్టకేలకు ప్రస్తుతం కేసీఆర్ ఆ పని నెరవేర్చారు. 700మమ్ది ఉద్యోగులను తెలంగాణలోకి తీసుకున్నారు. మొత్తానికి ఆరు సంవత్సరాల తర్వాత వారు తెలంగాణలో ఉద్యోగాలు చేయడానికి వస్తున్నారు. రాష్ట్రం విడిపోయాక ఇక్కడ పని చేసిన ఉద్యోగులు చెరో వద్దకి విడిపోవడంతో ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యారో అందరికీ తెలిసిందే.