తెలంగాణకు షాక్.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్‌ వెనక్కి

-

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయమై తెలంగాణ ప్రభుత్వానికి చేసే ప్రాజెక్టుల మదింపు డైరెక్టరేట్‌ షాక్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను మదింపు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఆ ఎత్తిపోతల డీపీఆర్‌ను తిప్పి పంపింది.

ప్రాజెక్టు మదింపు డైరెక్టరేట్‌కు చెందిన నిత్యానంద ముఖర్జీ ఈ మేరకు నాగర్‌కర్నూలు జిల్లా సాగునీటి వనరుల చీఫ్‌ ఇంజినీర్‌కు వర్తమానం పంపారు. ఆ డీపీఆర్‌ను తిప్పి పంపుతున్నట్లు వెల్లడించారు. ఈ సమాచారాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు, కేంద్ర జలశక్తిశాఖ ప్రాజెక్టుల విభాగం అధికారులకూ తెలియజేశారు.

’45 టీఎంసీల గోదావరి జలాలు పునఃకేటాయింపు అంశంపై..రాష్ట్ర విభజన తరవాత ఉభయ తెలుగు రాష్ట్రాలూ ఆ నీటిలో (45 టీఎంసీల్లో) వాటా కోరుతున్నాయి. ఈ నీటి విషయంలో తెలంగాణ, ఏపీల మధ్య పంపకానికి సంబంధించిన ఒప్పందం కుదరాల్సి ఉందని’ లేఖలో ప్రస్తావించారు. కేంద్రం జల వనరులశాఖ ఉత్తర్వుల ప్రకారం కూడా అంతర్‌ రాష్ట్రాల మధ్య ట్రైబ్యునల్‌ నీటి కేటాయింపులు చేయకుండా ఎలాంటి ప్రాజెక్టులకూ సాంకేతికంగా లేదా పెట్టుబడుల పరంగా అనుమతులు ఇచ్చే ఆస్కారం లేదని.. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాజెక్టుల వారీ కేటాయింపుల అంశం తొలిసారి ట్రైబ్యునల్‌ పరిశీలనలో ఉందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news